పేద మహిళ వైద్యానికి ముఖ్యమంత్రి నిధి ద్వారా సహాయం చేసిన ఎమ్మెల్యే
కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలోని మారేడ్ పల్లి కి చెందిన నిరుపేద మహిళ రాజమ్మ ఆనారోగ్యంతో ఇబ్బంది పడుతూ వైద్య ఖర్చుల కూడా డబ్బులు లేని పరిస్థితులలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి సహాయం కోరడంతో పరిస్థితులను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం 1 లక్ష రూపాయలు మంజూరు చేయించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పేద మహిళ రాజమ్మ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.