మాజీ ఎంపీపీని పరామర్శించిన మంత్రి   

మాజీ ఎంపీపీని పరామర్శించిన మంత్రి   

 

కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన కమాన్ పూర్ మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు కోలేటి మారుతినీ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదివారం పరామర్శించారు. మారుతి  తల్లి సుశీలమ్మ ఇటీవల అనారోగ్యంతోమృతి చెందింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐ. టి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం మారుతితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త కోలేటి నాగభూషణం ను అంజన్న వేణు తోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతకు ముందు స్వర్గీయ సుశీలమ్మ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు, మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం ,తాజా మాజీ సర్పంచ్ ఆకుల ఓదెలు, తొగరి అశోక్, గాండ్ల మోహన్, చొప్పరి శేఖర్, బిల్లా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version