ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తుంది 

ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తుంది 

 

26వ వార్డు సభలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్

 

 

ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీని కూడా సరిగా అమలు చేయకుండా సర్వేలు సమావేశాల పేరుతో కాలయాపన చేస్తుందని జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం పట్టణంలోని 26వ వార్డులో ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు నిర్వహించిన వార్డు సభ లో కౌన్సిలర్ నిమ్మల స్రవంతితో పాల్గొని కలిసి మాట్లాడారు. ప్రజాపాలనలో చాలామంది అర్హులు దరఖాస్తు చేసుకున్నరని వారి పేర్లు జాబితాలో లేవన్నారు. జాబితాలో లేనివారు మరల దరఖాస్తులు చేసుకునేందుకు దరఖాస్తు ఫారాలు కూడా అందుబాటులో లేవని అన్నారు. కొంతమంది ప్రజలు దరఖాస్తు ఫారాలు సంపాదించి దరఖాస్తు చేసుకుంటే వారికి రిసిప్ట్ ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు కల్పిస్తామంటూ ఏ ఒక్కటి అమలు చేయకుండా సర్వేలు సమావేశాలు పెడుతూ ప్రజలను ఆందోళనకు గురిచేయడం సరికాదు అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లపాటి అప్పారావు, ఉపేందర్, మున్సిపల్ వార్డు అధికారులు ఆర్పీలు అంగన్వాడి కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment