తోండాల గ్రామంలో అంగరంగ వైభవంగా ఊరు పండుగ సంబురాలు

తోండాల గ్రామంలో అంగరంగ వైభవంగా ఊరు పండుగ సంబురాలు

 

ఆకట్టుకున్న పోతరాజుల నృత్యాలు

 

 

మండలంలోని తోండాల గ్రామంలో ఈ ఏడాది కూడా సంప్రదాయపరమైన ఆచారాలకు కట్టుబడి శుక్రవారం ఘనంగా ఊరు పండుగ నిర్వహించారు. ఆలయ కమిటీ మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు గ్రామానికి ప్రత్యేకమైన పండగ వాతావరణాన్ని సృష్టించాయి. గ్రామంలోని ప్రధాన ఆలయాలు విద్యుత్ దీపాలతో ముస్తాబు చేయబడగా, ఆ ప్రకాశం పండుగ శోభను మరింత పెంచింది. భాజా భజంత్రీ, డప్పు సప్పుల శబ్దాలతో పోతరాజులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. గ్రామ మహిళలు నెత్తిపై బోనాలు ఎత్తుకుని నిర్వహించిన ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీ మహాలక్ష్మి ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతి ఇచ్చి, నైవేద్యం సమర్పించారు. అలాగే పోచమ్మ, మైసమ్మ, మహాలక్ష్మి ఆలయాల్లో భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా 

మాజి సర్పంచ్ లస్మన్న హెగ్డెకర్ మాట్లాడుతూ, ఈ పండుగ మా గ్రామీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థన చేశాం. చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామస్తులందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ పండుగను విజయవంతం చేశారు,” అని తెలిపారు.

గ్రామం మొత్తం పండుగ వాతావరణం నెలకొననగా, ఉత్సాహభరిత దృశ్యాలు కనిపించాయి. గ్రామ పెద్దలు, యువత, మహిళలు సహా ప్రతివారూ ఈ సంబరాల్లో పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment