గట్ల నర్సింగాపూర్ విద్యార్థుల ఎడ్యుకేషనల్ టూర్
ఎడ్యుకేషనల్ ఎక్స్పోజర్ విజిట్ లో భాగంగా తేదీ 30-01-2025 గురువారం రోజు భీమదేవరపల్లి మండలం జడ్పీహెచ్ఎస్ గట్ల నర్సింగాపూర్ 9వ తరగతి మరియు 10వ తరగతి విద్యార్థులందరూ కాకతీయ మెడికల్ కాలేజ్ అనాటమీ విభాగాన్ని దర్శించి ప్రొఫెసర్ చెప్పినటువంటి జీవశాస్త్ర సంబంధించిన విషయాలు విపులంగా తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా వరంగల్ కాకతీయ రాజుల కోట, వేయి స్తంభాల గుడి ప్రత్యేకత, సైన్స్ మ్యూజియం దర్శించి చారిత్రాత్మకమైన విషయాలు ఎన్నో తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి అవధానుల భాగ్యలక్ష్మి గారు ముందు ఉండి నడిపించారు. ఈ టూర్ లో మొత్తం 100 మంది విద్యార్థులు,10 మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమానికి వెన్నెముకగా నిలిచి విజయవంతం చేసినారు.