నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్, బడ్జెట్లో జిల్లాకు మొండిచెయ్యి
నిజామాబాద్ జిల్లా
టి యు సి ఐ
ప్రదాన కార్యదర్శి
కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పోరేట్ కంపెనీల అనుకూల బడ్జెట్. ప్రైవేటీకరణను మరింత వేగం చేయడమే ఈ బడ్జెట్ ఉద్దేశం. ఎఫ్డిఐల వాటా వంద శాతంకు పెంచడం ఇన్సూరెన్స్ రంగాన్ని ముఖ్యంగా ఎల్ఐసీ వంటి ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలను బలహీనపరచడంలో భాగమే. కేంద్ర బడ్జెట్లో దక్షిణ భారతదేశానికి మరోసారి అన్యాయం జరిగింది. ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకు బీహార్ ఢిల్లీ వంటి రాష్ట్రాలకు నిధులు వెచ్చించారు.తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్ర బీజేపీ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు ఆరుగురు ఎంపీలు ఉన్నా, ఒరిగిందేమీ లేదు. పసుపు బోర్డుకు ప్రత్యేకంగా నిధుల ప్రస్తావన లేదు. సికింద్రాబాద్ నుండి జిల్లా మీదుగా నాందేడ్ కు అసంపూర్తిగా ఉన్న డబ్లింగ్ పనులకు నిధుల కేటాయింపు లేదు. దేశ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న కార్మిక వర్గానికి కనీస ఉపషమన చర్యలు లేవు. వారికి ఉద్యోగ, ఆరోగ్య భద్రతకు భరోసా లేదు. కనీస వేతనాల అమలుపై ఊసే లేదు. నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపు లేదు. ఉద్యోగాల భర్తీ, ఉపాధి కల్పనకు చర్యలు లేవు. విద్యారంగ బలోపేతం కోసం ఆశించిన స్థాయిలో నిధుల కేటాయింపు లేదు. కొత్తగా కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల స్థాపన ప్రస్తావన లేదు