గుండాల మండలాన్ని అకస్మిత తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
రైతుబంధు అర్హులకే అందాలి జిల్లా కలెక్టర్
గుండాల మండల కేంద్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం సర్వే నిర్వహిస్తున్న అధికారుల బృందాన్ని ఆకస్మిక తనిఖీ చేసి ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు అర్హులకే అందే విధంగా మండల స్థాయి అధికారులు సర్వే నిర్వహించి అర్హులను గుర్తించే బాధ్యత మీపై ఉందని అన్నారు. గుండాల మండల కేంద్రంలో903 సర్వే నెంబర్ నుండి 909 వరకు ఉన్న వ్యవసాయ భూమిలో వెంచర్లు పెట్రోల్ బంకులు ఫంక్షన్ హాల్ హాస్టల్ వెంచర్ ప్రభుత్వ కార్యాలయాలు బస్టాండు సబ్ స్టేషన్ గుళ్ళు గోపురాలకు వాడుకున్న వ్యవసాయ భూములను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. గుండాల మండలంలో 20 గ్రామాలలో ఉన్న వెంచర్లు గుట్టలు కోళ్ల ఫారాలు ఇతర గ్రామస్తుల సేకరించి చాపల చెరువులు ఇతర అవసరాలకు వాడుకుంటున్న వ్యవసాయ భూములను వ్యవసాయ భూములను తొలగించాలని అన్నారు మండలంలో కొనసాగుతున్న గృహ సర్వే ఎంతవరకు వచ్చింది వివరాలు తెలుసుకున్నారు కొత్త రేషన్ కార్డులు జారీ విషయంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలు పూర్తిగా స్వీకరించి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జల కుమారి ఆర్ఐ అనసూర్య ఎంపీడీవో శంకరయ్య ఇన్చార్జ్ ఎంపిఓ ధనుంజయ్ ఏవో శ్రీనివాస్ ప్రభాకర్ రెడ్డి సర్వేర్ సుష్మా ఏ ఈ ఓ క్రాంతి మాధవి చైన్ మెన్ డి.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.