రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
టిఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ నల్లగొండ సభకుఆధ్వర్యంలో తరలి వెళ్లిన టిఆర్ఎస్ శ్రేణులు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి నల్లగొండలో జరిగే రైతు మహాధర్నా కు తరలి వెళ్లే వాహనాలను జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ పాలన సాగిస్తుందని మండిపడ్డారు. రైతు భరోసా ఎకరానికి 15000, ఇస్తానని చెప్పి కేవలం 12 వేలకే పరిమితమైందని కౌలు రైతులను గుర్తించకపోవడం దారుణం అన్నారు .కృష్ణా జలాల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా టిఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి టిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన రైతు మహా ధర్నా కు ప్రజలంతా మద్దతిస్తున్నారని తెలిపారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో లతీఫ్ సందీప్, కళ్యాణ్, ధర్మపురం గ్రామమాజీ సర్పంచ్ నెమ్మది నగేష్, వేణు ,కక్కిరేణి వెంకటేష్, కార్తీక్ ,నున్న యాదగిరి ,దొంగరి లింగస్వామి, రాజశేఖర్ ,సైదులు పాల్గొన్నారు.