సామాన్యులకు ఉపయోగం లేని, కార్పొరేట్లకు లాభం చేసే కేంద్ర బడ్జెట్.

సామాన్యులకు ఉపయోగం లేని, కార్పొరేట్లకు లాభం చేసే కేంద్ర బడ్జెట్.

 

సిపిఐ ఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బండారు శరత్ బాబు.

 

సిపిఎం ఆధ్వర్యంలో నిరసనగా 2025 బడ్జెట్ పత్రాలు దగ్ధం.

 

భద్రాచలం:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు, ఉద్యో గులకు, కార్మికులకు, రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదని కేవలం కార్పొరేట్ వర్గాల వారికి మాత్రమే ఉపయోగపడుతుందని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బండారు శరత్ బాబు అన్నారు. కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు స్థానిక అంబేద్కర్ సెంటర్లో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో ఎటువంటి నిధులు కేటాయించలేదని, తెలంగాణకు నిధులు కేటాయించకుండా మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. బిజెపి పాలిత రాష్ట్రాల పట్ల ఒకరకంగా, ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల పట్ల మరొక రకంగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని విమర్శించారు. పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట రామారావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పారెల్లి సంతోష్ కుమార్, డి సీతాలక్ష్మి, పట్టణ కమిటీ సభ్యులు కోరాడ శ్రీనివాసరావు, కుంజ శ్రీనివాస్, చుక్క మాధవరావు, ఎం.వి.యస్ నారాయణ, డి సతీష్ కుమార్, మురళీకృష్ణ, చాట్ల శ్రీను, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment