బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం తెలంగాణ కు అన్యాయం చేసింది, చల్లా నర్సింహారెడ్డి

బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం తెలంగాణ కు అన్యాయం చేసింది, చల్లా నర్సింహారెడ్డి

 

 

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పై వివక్ష చూపి నిధుల కేటాయింపులో అన్యాయం చేసినందుకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడు & ఛైర్మన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున జిల్లా ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పిసిసి సభ్యులు, జిల్లా నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చల్లా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర సమస్యలు, అభివృద్ధి అంశాలను పట్టించుకోలేదని విమర్శించింది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)కి 5 వాతం వాటాను అందిస్తున్న తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్రం నుంచి రూ.26 వేల కోట్ల పన్ను ఆదాయం కేంద్రానికి వెళ్లిందని, 8 మంది బీజేపీ ఎంపీలను తెలంగాణ గెలిపించి పంపించిందని గుర్తుచేశారు. అయినా తెలంగాణకు ప్రధాని మోదీ ద్రోహం చేశారని విమర్శించారు. ఈ బడ్జెట్‌లో కేంద్ర సెస్‌లను మరింత పెంచుకుందని, దానివల్ల రాష్ట్రాల పన్నుల వాటాలు తగ్గే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర సౌజన్య పథకాలపై రాష్ట్రాలు ఆధారపడేలా నిధులు పెంచిందని, సీఎస్‌ఎస్‌లను రాష్ట్రాలు వర్తింపజేసుకోవాలా లేదా.. అన్న స్వయం నిర్ణయ అధికారాన్ని విస్మరించిందని విమర్శించారు…

 

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక కేంద్ర సహాయ మంత్రి మరియు ఒక కేంద్రమంత్రి ఉండి ఎలాంటి ప్రయోజనం లేదని వారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు…

 

రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామిరెడ్డి మాట్లాడుతూ మూసి ప్రక్షాళన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటే అడ్డుపడే బిజెపి ఎంపీలు బడ్జెట్లో అన్యాయం జరిగితే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ? ప్రజలకు న్యాయం జరిగే వరకూ మూసిలో ప్రాంతంలో పడుకుంటామని ప్రగల్బాలు పలికిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఢిల్లీలో వెళ్లి అక్కడ పడుకొని రాష్ట్ర సమస్యలను & రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఎందుకు తీసుకురావడం లేదని వారిని ప్రశ్నించారు. ప్రధాని మోడీ దేశానికి ప్రధానియా లేక ఉత్తర రాష్ట్రాలకు మాత్రమే ప్రధాన మంత్రి ఆ అని అనుమానం వ్యక్తం చేశారు ఎక్కడ ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించారని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయానికి చిత్తశుద్ధిగా 8 మంది బిజెపి ఎంపీలు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు…

 

ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకోరా అని అసమర్థులు బిజెపి ఎంపీలని వాళ్ళని ఎద్దేవ చేశారు, అలాగే వారు మాట్లాడుతూ ఇట్టి సమస్యపై పిసిసి దృష్టికి తీసుకెళ్లి ఢిల్లీ రాజధాని లో జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

 

ఈ కార్యక్రమంలో కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి , ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి , జిల్లా గ్రంథాలయ కమిటీ అధ్యక్షులు ఎలుగంటి మధుసూదన్ రెడ్డి , ఎల్బీనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ , నార్సింగ్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు వేణు గౌడ్, గుడ్డు మల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్ ముదిరాజ్, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, పిసీసీ జనరల్ సెక్రటరీ వేణు గౌడ్, పిసిసి జనరల్ సెక్రెటరీ గజ్జి భాస్కర్, పిసిసి సభ్యులు దేపా భాస్కర్ రెడ్డి, పిసిసి సభ్యులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి , టీపీసీసీ స్పోక్స్ పర్సన్ యోగేశ్వర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, బడంగ్పేట్ మాజీ మేయర్ శ్రీమతి పారిజాత, మాజీ కార్పొరేటర్ శ్రీమతి శాలిని, ఇబ్రహీంపట్నం సీనియర్ నాయకులు శేఖర్ మామ, మండల పార్టీ అధ్యక్షులు కిషన్ నాయక్, శంషాబాద్ అధ్యక్షుడు శేఖర్ యాదవ్, మహిళా నాయకులు సమత, సుగుణ, హర్షలత మరియు వివిధ మండల పార్టీ అధ్యక్షులు, డివిజన్ ప్రెసిడెంట్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment