గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బిఆర్ఎస్ శ్రేణులు

గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బిఆర్ఎస్ శ్రేణులు

 

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపుమేరకు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, BRS పార్టీ కామారెడ్డి జిల్లా అద్యక్షులు యంకె ముజీబోద్దీన్ గార్ల ఆదేశానుసారం కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్ ఆవరణలో గల గాంధీజీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 420 హామీలిచ్చి ఇచ్చిన హామీలను అమలుపర్చక ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వనికి నిరసనగా బిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కుంబాల రవి యాదవ్, మాజీ కౌన్సిలర్లు గెరిగంటి లక్ష్మీనారాయణ, పోలీస్ కృష్ణాజీరావ్, రైతు బంధు కమిటీ మండల అధ్యక్ష్యులు నిట్టు లింగా రావు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment