గణతంత్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి 

గణతంత్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి 

–జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

 

ఈ నెల26 న గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.కలెక్టర్ కార్యాలయంలోనీ కలెక్టర్ ఛాంబర్ లో బుధవారం అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల ద్వారా శకటాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, అధికారులకు ప్రశంసా పత్రాలు అందించడానికి ఈ రోజు వరకు జాభితా ఇవ్వాలని సూచించారు.

వేడుకలకు సంబంధించి ప్రోటోకాల్ పాటిస్తూ అతిధులు కూర్చోడానికి అనువుగా షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేయాలని, స్టేజ్ ఏర్పాట్లు, త్రాగునీటి సరఫరా, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాట్లను సంబంధిత శాఖ అధికారులు పోలీస్ పెరెడ్ గ్రౌండ్ లో పకడ్బందీగా నిర్వహించాలని, జిల్లా ప్రగతి సందేశమును తయారు చేయాలని, స్టాళ్లను ఏర్పాటు చేయాలని అదికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులతో దేశభక్తి గీతాలపై నృత్య ప్రదర్శనలు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల చే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని డిపిఆర్వో ను, డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. వేడుకలసందర్భంగాఅంబులెన్సులు,అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంచాలని అన్నారు. గ్రౌండ్ లో పారిశుద్ధ్య.కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఇతర శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment