ఆదివాసి మహిళ లోకానికి, రాష్ట్రపతికి క్షమాపణ చెప్పాలి : కొత్త సురేందర్.

ఆదివాసి మహిళ లోకానికి, రాష్ట్రపతికి క్షమాపణ చెప్పాలి : కొత్త సురేందర్.

 

ఏటూరునాగారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు వినుకొల్లు చక్రవర్తి అధ్యక్షతన, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు గండపల్లి సత్యం ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్ హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ భారతదేశ గిరిజన మహిళ అయిన డాక్టర్ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ని అనుచితి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అని, 1947 నుండి 2025 వరకు 76 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన మహిళలను ఏనాడు గౌరవించలేదు కానీ, బిజెపి పార్టీ భారతదేశ అత్యుత్తమమైన భారతదేశ ప్రథమ పౌరురాలుగా గిరిజన బిడ్డకు పదవి ఇవ్వడం జరిగినది అన్నారు. సోనియా గాంధీ ఒక మహిళ అయి ఉండి కూడా మరో గిరిజన మహిళలను కించపరచడం అనేది ఆనవాయితీగా వస్తూనే ఉంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ఆదివాసి మహిళను కించపరిచే విధంగా మాట్లాడడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా దేశ గిరిజన మహిళలకు క్షమాపు చెప్పాలని లేనిచో భారతీయ జనతా పార్టీ గిరిజన ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వావిలాల జనార్దన్ దళిత మోర్చాజిల్లా అధ్యక్షులు,గిరిజన మోర్చా జిల్లా నాయకులు అజ్మీర కిషోర్ నాయక్,జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి ఈక మహాలక్ష్మి, పలకగంగ మాజీ మండల అధ్యక్షుడు గాడి చర్ల రాజశేఖర్, కేరళ ఎల్లయ్య గద్దల ప్రణయ్,కర్నే సంపత్, యానాల చంద్రారెడ్డి, నరాల రవి కిషోర్, మోర్చా మండల అధ్యక్షుడు ఎలుక పెళ్లి శ్రీను, బొల్లె శ్రీను,అజిత్ పోరెడ్డి వెంకన్న,పల్ల మహేష్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment