హైదరాబాద్: తెలంగాణ పంచాయితీ ఎన్నికల కోసం రేవంత్ ప్రభుత్వం తుది కసరత్తు చేస్తుంది.
జనవరి 14న పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
మూడు ఫేజుల్లో పంచాయితీ ఎన్నికలు జరిగనున్నాయి.
ఈ మేరకు పంచాయితీ రాజ్ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
మినిమం ఐదుగురు ఎంపీటీసీలతో ఒక ఎంపీపీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.
ముగ్గురు ఎంపీటీసీలతో ఎంపీపీలున్న మండలాల్లో ఎంపీటీసీల సంఖ్యను ఐదుకు పెంచాలని నిర్ణయించింది.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీపీ సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది.
వచ్చే పంచాయితీ ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయనుంది. ఆ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం బిల్లు పెట్టనుంది.