తెలంగాణకు ఒక్కరు కాదు ఇద్దరు సీఎంలు: కేంద్రమంత్రి బండి సంజయ్

తెలంగాణకు ఒక్కరు కాదు ఇద్దరు సీఎంలు: కేంద్రమంత్రి బండి సంజయ్

చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో నవంబర్ 17 ప్రతినిది

సంగారెడ్డి జిల్లా
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండూ కలిసి నాటకాలు చేస్తున్నా యని,కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు.

సంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కాళేశ్వరం కుంభకోణం, ఫోన్ ట్యాపిం గ్, ధరణి కుంభకోణాల్లో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ చెప్పిం దని బండి సంజయ్ గుర్తుచేశారు.

అంతేకాకుండా దీపావళికి ముందే తెలంగాణలో బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన గుర్తుచేశారు.

దీపావళి పండగ పోయి త్వరలోనే సంక్రాంతి పండగ కూడా రాబోతోంది, కానీ కాంగ్రెస్ నేతలు చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ నేతల గురించి అన్ని మాటలు చెప్పిన కాంగ్రెస్ నేతలు, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు.

బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ హై కమాండ్ ను కలవడంతోనే ఈ కుంభకోణాలు అన్నీ ఏమైపోయాయో ఏమోనని కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యం గ్యాస్త్రాలు సంధించారు.

తెలంగాణలో ప్రస్తుతం ఇద్దరు సీఎంలు ఉన్నారని.. వారిలో ఒకరు రేవంత్ రెడ్డి కాగా మరొకరు కేటీఆర్ అని బండి సంజయ్ అభిప్రాయ పడ్డారు. కేటీఆర్ నటన చూసి జనం నవ్వుకుంటు న్నారని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment