గురు’తర బాధ్యతను చేపట్టిన వారే నిజమైన ఉపాధ్యాయులు.
హైదరాబాద్ (చార్మినార్ ఎక్స్ ప్రెస్)
సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాలను ప్రపంచానికి సులభంగా, స్పష్టంగా చెప్పారు సర్వేపల్లి.ఆధునిక సమాజానికి గురువు ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన తన స్వీయచరిత్రలో వివరించారు.గురువుకు ఉండాల్సిన లక్షణాలను మన పురాణాల్లోను వివరించారు.గురుశిష్యుల సంబంధాలకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు – అర్జునుడు, చాణక్యుడు – చంద్రగుప్త మౌర్యుడు, సమర్థ రామదాసు – ఛత్రపతి శివాజీ, రామకృష్ణ పరమహంస – వివేకానంద స్వామిలు గురుశిష్యుల సంబంధానికి ప్రతీక.
ఉన్నతమైన విజ్ఞానాన్ని బోదించి ఉత్తమమైన సంస్కారాన్ని రంగరించి సమున్నతమైన వ్యక్తిత్వాన్ని నిర్మించి సుశిక్షితులైన పౌరులను అందించి దేశభక్తిని నిలువెల్లా నింపి భారతదేశాన్ని విశ్వగురుపీఠంపై పున:ప్రతిష్ఠించే ‘గురు’ తర బాధ్యతను చేపట్టిన వారే నిజమైన ఉపాధ్యాయులు.