కాకతీయుల కాలం నాటి శివాలయం కోరిన కోరికలెల్ల తీర్చెటి రామలింగ క్షేత్రం..

కాకతీయుల కాలం నాటి శివాలయం కోరిన కోరికలెల్ల తీర్చెటి రామలింగ క్షేత్రం..

హర హర కాశీ రామలింగేశ్వరా..

ముజ్జగములేలు జంగరా మాకై కదలిరా..

ముత్యమంత ఉదకమైన మురిసేటి మూడు కన్నులవాడా..

కోరిన కోరికలెల్ల నిష్కపటముగా రుణం లేకుండా తీర్చేటి భోళా శంకరా..

పత్రమైన,పుష్పమైన ప్రియముగా స్వీకరించే లయకారుడా..

భస్మమైనా,భక్తి అయిన కాయముపై ధరించే భయహరుడా..

భక్తి తోడ పిల్వ రామలింగ.

శక్తి తోడ పల్కు శివగంగ..

ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా నేటి మానుకోట జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో కాకతీయులు తవ్వించిన తటాకం కి దగ్గరలో లింగ రూపంలో నెలవైన పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయాన్ని అదే కాకతీయ రాజులే ప్రతిష్టించారు.

ఒకప్పటి ముప్ఫారం కలాన్ (పూర్వ పేరు) నుండి నేటి పెద్దముప్పారం వరకు కోరిన కోరికలను తీర్చే దైవంగా పూజలందుకుంటున్న రామలింగేశ్వరుడు..

దేవాలయ కట్టడం కూడా నేటికీ చెక్కు చెదరకుండా పటిష్టంగా వుండడం విశేషం.

గర్భ గుడి,ఆలయ గోపురం పై శిల్ప కళ, కళ్యాణ మండపం నాటి వాస్తు సూత్రాలతో కట్టిన కోవెల..

ప్రశాంత వాతావరణం లో కాకతీయుల కాలం నుండి నేటికీ నిత్య అభిషేకాలు పూజా క్రతువులు నిర్వహిస్తూ నేటికీ అత్యంత వైభవంగా వెలుగొందుతున్న దేవస్థానం..

పారుపల్లి రామన్న,భీమన్న,విద్యాసాగర్, వెంకన్న, సత్యనారాయణ,ఉపేందర్,రాజమౌళి వీళ్ళ కుటుంబీకుల ఆధ్వర్యంలో నిత్యం పూజలతో వెలుగొందింది నేడు అదే గుడిని వైదిక గ్రామ పురోహితులు కీ.శే. పోలంపల్లి నరసింహమూర్తి కుమారులైన రమణ శర్మ,పవన్ శర్మ రూపంలో దేవాలయానికి పెద్ద పీఠ వేస్తూ రామలింగేశ్వర స్వామికి అత్యంత వైభవంగా అభిషేకార్చన,హోమ, నిత్య పూజా కార్యక్రమాలతో భక్తుల సహకారంతో గ్రామ సుభిక్షానికి కృషి చేస్తూ పారుపల్లి కుటుంబీకులకు కొనసాగింపుగా అన్ని తామై దేవాలయాన్ని పర్యవేక్షిస్తున్నారు.

దేవాలయం గుడి గర్భాలయంలో వున్నటువంటి శ్రీ చక్రం ఇక్కడి ప్రత్యేకత.

దీనిని లింగ రూప రామలింగేశ్వర స్వామి ప్రతిష్ఠ సమయంలో కాకతీయులు ఏర్పాటు చేశారు..

ప్రస్తుత గ్రామ పురోహితుల ఆధ్వర్యంలో 2012 నుండి గత 12 ఏళ్లుగా ప్రతి కార్తీకమాసం పలు రకాలైన ప్రత్యేక పూజా కార్యక్రమాలతో,వేద మంత్రోచ్చారణల మధ్య పార్వతీ రామలింగేశ్వర స్వామికి వివిధ రకాల కైంకర్య సేవలు చేస్తూ వున్నారు.ఆలయంలో రోజువారీ జరిగే పూజలు ఒక ఎత్తు అయితే శివుడికి ప్రీతికరమైన కార్తీక మాసంలో నిర్వహించే కార్యక్రమాలు ఒక ఎత్తు..

మొదటి సంవత్సర కార్తీక మాసం 365 లింగ రూప రామలింగేశ్వరునికి మహా లింగార్చన వేద పండితుల మధ్య ప్రత్యేక హోమాలు.

రెండవ సంవత్సర కార్తీక మాసాధ్యంతం నిత్యం మహాన్యాస పూర్వక విశేష అభిషేకం,రుద్ర హోమం.

మూడో సంవత్సర కార్తీక మాసంలో సహస్ర లింగార్చన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం

నాలుగో సంవత్సరం కార్తీక మాసం లక్ష బిల్వార్చన ప్రత్యేక అర్చన,హోమాలు.

ఐదవ కార్తీక మాసంలో ఘటఘటాభిషేకం నిత్య పూజా అభిషేకాలు.

ఆరవ సంవత్సరం కార్తీక మాసంలో నవ చండి యాగం, వైభవోపేతంగా పార్వతీ రామలింగేశ్వరుల కళ్యాణం.

ఏడవ కార్తీక మాసంలో ప్రతి రోజూ ప్రత్యేక పుష్పాలంకరణలో రామలింగేశ్వరుడి దర్శనం,చివరి రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం.

ఎనిమిదవ సంవత్సరం కార్తీక మాసంలో ప్రతి రోజు మహాన్యాస పూర్వక అభిషేకాలు రుద్ర హోమం నిత్య అలంకరణలు.

తొమ్మిదో కార్తీక మాసంలో అఘోరాత్ర అభిషేక కార్యక్రమాలు శివ పార్వతుల కళ్యాణం.

పదవ సంవత్సరం కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు పుష్ప లింగార్చన కార్యక్రమాలు జరిగాయి.

పదకొండవ సంవత్సరం కార్తీక మాసం శత రుద్ర యాగం,విగ్రహాల సంప్రోక్షణ,వేద స్వస్తి శివ పార్వతుల మాహ ప్రసాద వితరణ కార్యక్రమం.

పన్నెండవ కార్తీక మాసాన చండీయాగం,రుద్రయాగం,సూర్య నమస్కారాలు,నవగ్రహ హోమం,వాస్తు హోమం,వేద స్వస్తి,శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం,అన్న ప్రసాద వితరణ,శివ పార్వతుల ఊరేగింపు మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు..

కార్తీక మాసమంతయు భక్తితో నీకు చేసిన అభిషేకార్చన వేదమంత్రోచ్చరణలతో ఆనందభరితుడవై మాయందు దయతో కోరుకున్న కోర్కెలు నెరవేర్చ కదిలిన భోళా శంకరా..

ఈ మాసాధ్యాంతం పూజా కార్యక్రమాలతో అలసి సొలసి ఈ సాయంత్రపు సమయాన ఆ చల్లటి గాలుల మధ్య సేద తీరుతూ మా పుర వీధుల విహారంకై విచేయుచున్న శివయ్య..

గధగ మెరిసే కాంతుల మధ్య దేదీప్యమానంగా దర్శనమిస్తూ కన్నుల పండుగగా సాగే నీ ఊరేగింపు చూడ మది పరవశంతో తడి కన్నులై నీ చరణాలను శరణు కోరుతుంది శివయ్య

ఇలా ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను రామలింగేశ్వర స్వామి భక్తుల,గ్రామస్తుల సహాయ సహకారంతో దేదీప్యమానంగా మహోన్నతంగా నిర్వహిస్తూ వస్తున్నారు..

దేవాలయ అర్చకులు రమణ శర్మ పవన్ శర్మ ఎంతో శ్రమ తీసుకొని భక్తుల సహకారంతో దేవాలయం కి కావలసిన జరగవలసిన అభివృద్ధి చేస్తూ విధిగా పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందీ లేకుండా సౌకర్యాలు కల్పించారు.

ఆహ్లాదంగా,అడుగు పెట్టగానే ప్రశాంత వాతావరణంలో గుడి వాతావరణం మనసులో భక్తి భావాన్ని తట్టి లేపుతుంది..

గ్రహ దోషాల దృష్ట్యా వివాహం కాని వారు,సంతానం లేనివారు ఈ ఆలయంలో ప్రత్యేక పూజా అభిషేకాలు,నవగ్రహ పూజ,గోపూజ, నాగ దోష నివారణ పూజలు నిర్వహించడం వల్ల వివాహం జరగడం, సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇక్కడి ప్రసిద్ధి.

శ్రీనివాస భక్త జన మండలి వారి ఆధ్వర్యంలో ప్రతి వారం భజన కార్యక్రమాలు..

నవగ్రహ పూజలు హోమాలు,నాగ దోష,కుజ దోష నివారణ పూజలు, ఇక్కడి లింగ రూపం కాశీ నుండి తెచ్చి ప్రతిష్టించారు,50 అడుగుల గాలి గోపురం,నందీశ్వరుడి అర్ధ మండపం,రాతి మీద విగ్రహం ఇక్కడ విశేషంగా చూడవలసిన ఆలయ ప్రత్యేకతలు,

ప్రతి శివరాత్రికి శివ పార్వతుల కళ్యాణం,బండ్లు తిరుగుడు పండుగను జాతరలాగ నిర్వహిస్తుంటారు..

చెక్కతో చేసిన 20 అడుగుల రథం శివ పార్వతుల ఊరేగింపును ఘనంగా నిర్వహించేవారు.

విద్యారణ్య మహా సంస్థానాధిశ్వరులు శ్రీ శ్రీ శ్రీ శంకరాచార్య జగద్గురువులు హంపి విరూపాక్ష పీఠాధిపతి గురువులు కూడా ఇన్ని ప్రత్యేకతలు వున్న దేవాలయాన్ని సందర్శించారు..

జగద్గురు గీతా ఆశ్రమ పీఠాధిపతి బ్రహ్మశ్రీ జ్ఞాన చైతన్యానంద స్వామి వారు కూడా ఈ రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు.

అలాగే సినీ,రాజకీయ ప్రముఖులు కూడా స్వామి వారి దర్శానికి ఈ దేవాలయానికి వస్తుంటారు.

ఈ దేవాలయానికి ఇతర ప్రాంతాల నుండి కూడా రవాణా సౌకర్యం గలదు.

వరంగల్, మహబూబాబాద్ నుండి తొర్రూరు మీదుగా బస్ సౌకర్యం,సూర్యాపేట ఖమ్మం నుండి దంతాలపల్లి మీదుగా రవాణా సదుపాయం కలదని ఆలయ అర్చకులు తెలిపారు..

Join WhatsApp

Join Now

Leave a Comment