నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు ధర్నా సెంటర్ దగ్గర ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె కొనసాగిస్తున్నారు నిన్న మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అకాల మరణం చెందినందున ఆయన చిత్రపటానికి సమగ్ర శిక్ష ఉద్యోగులు నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా జాక్ నాయకుడు రాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు గత 18 రోజులుగా సమ్మె లో ఉన్నారని కె జి బి వి లో తాత్కాలికంగా పనిచేయడానికి కొందరు టీచర్లను నియమించింది ఆ ఉద్యోగులకు మేము కోరేది ఒకటే మా కడుపు కొట్టొద్దు అని ప్రభుత్వం ఇంకా దిగిరకపోతే కె జి బి వి ఉద్యోగులం అంతా 100 శాతం సమ్మెకుపోవాలనిఆలోచనలో ఉన్నారని అన్నారు నేడు సమగ్ర శిక్ష ఉద్యోగులకు తెలంగాణ ప్రాంత టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డప్ప జిల్లా ఉపాధ్యక్షులు వెంకటప్ప తపస్ నాయకులు రామకృష్ణ సంఘీభావం ప్రకటించారు ఈ కార్యక్రమంలో గౌరమ్మ శాలిని విజయ ఎల్లాగౌడ్ అల్తాఫ్ లక్ష్మణ్ నరేష్ మధు అనిత మహిపాల్ తోపాటు సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు