మంత్రులతో రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం.
హైదరాబాద్(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రాష‌్ట్ర వ్యాప్తంగా హైడ్రాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వస్తుండటంతో దీనిపై చర్చిస్తున్నారు.ఈ సమావేశానికి హైడ్రా కమిషనర్ రంగనాధ్ కూడా హాజరయ్యారు. అయితే అంతకు ముందు ఏసీబీ, విజిలెన్స్ అధికారులతో ఆయన మాట్లాడుతూ హైడ్రా పేరు చెప్పి కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు.గతంలో ఇచ్చిన ఇది వరకు ఇచ్చిన నోటీసులను అడ్డం పెట్టుకుని డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్,మున్సిపల్ అధికారులపై ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయన్నారు.అలాంటి అధికారులను క్షమించబోమని తెలిపారు. వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.వసూళ్లకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.