పారాలింపక్స్ పతక విజేత దీప్తి జివాంజీకి భారీ నజరానా ప్రకటించిన రేవంత్ రెడ్డి..
హైదరాబాద్(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
పారాలింపిక్స్‌లో కాంస్య పతక విజేత జీవాంజీ దీప్తికి తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. 400 మీటర్ల పరుగు టీ20 విభాగంలో కాంస్య పతకం సాధించారుదీప్తి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. దీప్తిని అభినందించారు. ప్రభుత్వం తరపున రూ. కోటి తోపాటు గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం దీప్తికి ఇస్తామని ప్రకటించారు. ఇక, ఆమె కోచ్ కు రూ. 10 లక్షల నగదు బహుమతిగా ప్రకటించారు.
కాగా, పారిస్ పారాలింపిక్స్‌లో దీప్తి.. మహిళల 400 మీటర్ల టీ-20 విభాగంలో కాంస్య పతకం సాధించింది. పారాలింపిక్స్ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్తించింది. శనివారం దీప్తి కుటుంబ సభ్యులు, కోచ్, నేతలు, అధికారులు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
పారాలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు శిక్షణ, ఇతర ప్రోత్సాహం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, శాట్ ఛైర్మన్శివసేనా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.