ఒకే వేదికపై ప్రొఫెసర్ కోదండరామ్- కేటీఆర్.
ఈ ఆసక్తికర సన్నివేశం రవీంద్రభారతి వేదికగా చోటుచేసుకుంది. శనివారం ఉదయం 11 గంటలకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సంస్మరణ సభలో ఈ దృశ్యం కనిపించింది. సభలో కేటీఆర్ ప్రసంగించిన అనంతరం కేటీఆర్ ప్రొఫెసర్ పక్కన కూర్చున్నారు. ఈ క్రమంలోనే కోదండరామ్ కేటీఆర్‌ను పలకరించారు. వెంటనే కేటీఆర్ సైతం ఆయన్ను పలకరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.