కంటోన్మెంట్ కు ప్రతిష్టాత్మక రక్షా మంత్రి అవార్డు ప్రదానం*

” స్వచ్ఛ చావనీ -స్వచ్చ్ చావనీ ” 2024 ఎక్సెలెన్స్ ‘ ఏ ‘ కేటగిరి విభాగంలో ప్రతిష్టాత్మక కేంద్ర రక్షా మంత్రి అవార్డును సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ప్రధానం చేశారు.

సోమవారం *డిఫెన్స్ ఎస్టేట్ డే* ను పురస్కరించుకొని న్యూ ఢిల్లీలోని చాణక్య అడిటోరియంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సిఈఓ మధుకర్ నాయక్, నామినేటెడ్ సభ్యులు జె.రామకృష్ణ, హెల్త్ సూపరింటిండెంట్ దేవేందర్,శానిటేషన్ సూపరింటిండెంట్ ఆకుల మహేందర్ లు రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా బోర్డ్ మెంబర్ జె.రామకృష్ణ మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డ్ అధికారులు, ఉద్యోగులు, కార్మికుల నిరంతర కృషి మరియు వారి అంకితభావనీకి ఈ అవార్డు నిదర్శనమని అన్నారు. కంటోన్మెంట్ ప్రజల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ దేశంలో అన్నిరంగాలలో మొదటి స్థానంలో నిలుస్తుందని, అభివృద్ధిలో దూసుకువెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే బోర్డ్ అధికారులకు, ఉద్యోగులకు, కార్మికులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో రక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ రాజేశ్వరన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment