గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు
చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో ఆగస్టు 06 ప్రతినిధి
మెదక్ జిల్లా తెలంగాణ ఉద్యమ నాయకులు మన్నె శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ప్రజా యుద్ధ నౌక శ్రీ గద్దర్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు తూప్రాన్ లో ప్రజాయుద్ధనౌక, ప్రజాకవి, గాయకుడు, తూప్రాన్ ముద్దుబిడ్డ శ్రీ గద్దర్ (గుమ్మడి విట్టల్) గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. గద్దర్ గారు చేసినటువంటి సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ మామిళ్ల జ్యోతి కృష్ణ, మెదక్ జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్, వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, కౌన్సిలర్లు రాముని గారి శ్రీశైలం గౌడ్, రవీందర్ రెడ్డి, పల్లెల రవీందర్ గుప్తా, నర్సోజి, రఘుపతి, కాంగ్రెస్ పట్టణ యూత్ అధ్యక్షులు రాముని గారి నాగరాజుగౌడ్, నర్సింగ్, సత్యనారాయణ యాదవ్, బొల్లు నాగులు, మల్లికార్జున్ గౌడ్, బాయ్ కాడి ఆంజనేయులు, గౌటి బాలేష్, గడ్డం వెంకటేష్ ,ఎండి హుస్సేన్, ఓయూ విద్యార్థి సంఘం నాయకులు శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు