గణేష్ మహారాజ్ ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ తెలిపారు.

గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నేడు కంటోన్మెంట్ లోని వివిధ గణేష్ మండపాల వద్ద జరిగిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని తానే స్వయంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్బంగా శ్రీగణేష్ మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని, పండుగ యొక్క విశిష్టతను కాపాడుతూ భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను అందించాలని నిర్వాహకులకు సూచించారు. పండుగను ఘనంగా జరుపుకోవడం కోసం రేవంత్ ప్రభుత్వం మండపాలకు ఉచిత విద్యుత్ ను ఇవ్వాలని ఆదేశించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముప్పిడి మధుకర్ ,బల్వంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అరుణ్ యాదవ్, శరత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment