ఎవ‌రూ చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకోవ‌ద్దు.

ఎవ‌రూ చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకోవ‌ద్దు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య నెల‌కొన్న వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.ఈ క్ర‌మంలో బీఆర్ఎస్ నేత‌ల తీరుపై డీజీపీ జితేంద‌ర్ మండిప‌డ్డారు. ఎవ‌రూ చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నించవ‌ద్ద‌ని హెచ్చ‌రించారు హైద‌రాబాద్‌ రాచ‌కొండ‌ సైబ‌రాబాద్ ప‌రిధిలో ఎలాటి ఆందోళ‌ల‌న‌కు అవ‌కాశం లేద‌ని తెలిపారు. విద్వేషాల‌ను రెచ్చ‌గొడితే ఏమాత్రం స‌హించ‌బోమ‌ని హెచ్చ‌రించారు.తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ‌తీస్తే ఊరుకోబోమని అన్నారు. కాగా ఇద్ద‌రు ఎమ్మెల్యేల మ‌ధ్య నెల‌కొన్న వివాదం గురువారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విష‌యం తెలిసిందే చివరికి ఈ వివాదం ప‌లువురు బీఆర్ఎస్ కీలక నేత‌ల‌ అరెస్ట్‌ల వ‌ర‌కు వెళ్లింది

Join WhatsApp

Join Now

Leave a Comment