కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ గడువు పొడిగింపు
మరో రెండు నెలలు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం
జూన్ నెలలో ఓసారి, ఇప్పుడు మరోసారి పొడిగింపు
అక్టోబర్ నెలాఖరుతో ముగియినున్న గడువు
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్ గడువును ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. ఈ ప్రాజెక్టులో భారీ అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్‌ను వేసింది. ఈ క్రమంలో జస్టిస్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును అక్టోబర్ నెలాఖరు వరకు పొడిగిస్తూ నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు.మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను వేసింది. కమిషన్ గడువు తొలుత జూన్ నెలలో ముగిసింది. అప్పుడు రెండు నెలలు పొడిగించారు. ఇప్పుడు మరో రెండు నెలలు పొడిగించారు