కడప జిల్లా చార్మినార్ ఎక్స్ప్రెస్ న్యూస్:

కడప జిల్లా చార్మినార్ ఎక్స్ప్రెస్ న్యూస్:

 

యూజీసీ ముసాయిదా నిబంధనలు ఉపసంహరించాలి: కామనురు. శ్రీనివాసులురెడ్డి 

 

ఇటీవల విడుదల చేసిసిన యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నిబంధనలు 2025 ముసాయిదాను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సి పి ఎం జిల్లా కమిటీ సభ్యులు కామనురు. శ్రీనివాసులురెడ్డి డిమాండ్‌ చేశారు ఈ మేరకు నేడు ఒక ప్రకటన తెలిపారు. ముఖ్యంగా వైస్‌ ఛాన్సలర్ల నియామకం కోసం సవవరించిన నిబంధన రాష్ట్రాల హక్కులపై ప్రత్యక్ష దాడిగా సిపిఎం కడప జిల్లా కమిటీ విమర్శించింది. వైస్‌ ఛాన్సలర్లను ఎంపిక చేసే అధికారం గవర్నర్‌-ఛాన్సలర్‌ నియమించే ముగ్గురు సభ్యుల సెలక్షన్‌ కమిటీకి కట్టబెట్టడాన్ని, పైగా ఈ కమిటీకి గవర్నరే చైర్‌పర్సన్‌గా ఉండటాన్ని సిపిఎం ప్రశ్నించింది. ప్రస్తుతం కొన్ని ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో వైస్‌ఛాన్సలర్ల నియామకంలో గవర్నర్లు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్న సమయంలో ఈ నిబంధన తీసుకుని రావడాన్ని గుర్తు చేసింది. ఈ సెలక్షన్‌ కమిటీలో ఎవర్ని నియమిస్తారనే విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదని, ఈ నిబంధనతో గవర్నర్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో తనకు నచ్చిన వైస్‌ఛాన్సర్లలను నియమించుకోవచ్చనని సిపిఎం జిల్లా కమిటీ తెలిపింది. ఈ ముసాయిదా ద్వారా విద్య అనేది ఉమ్మడి జాబితా అనే రాజ్యాంగ నిబంధనను కేంద్రం ఉల్లంఘించిందని అన్నారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలతో సహా అన్ని ప్రజాస్వామిక వర్గాలు,మేధావి వర్గం విద్యార్థి సంఘాలు

ఈ ప్రమాదకరమైన నిబంధనను ఐక్యంగా వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment