కడప జిల్లా బ్రహ్మం గారి మఠం చార్మినార్ ఎక్స్ప్రెస్ న్యూస్:
అర్హులైన పేదలందరికీ 3 సెంట్ల ఇంటి స్థలం 3 ఎకరాల సాగుభూమి మంజూరు చేయాలి:- సిపిఐ
ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలి:-సిపిఐ డిమాండ్
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శుక్రవారం బ్రహ్మంగారిమఠం మండలంలో తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ గారికి సిపిఐ నాయకులు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సిపిఐ మండల నాయకులు పెద్దులపల్లి ప్రభాకర్,సీనియర్ నాయకులు నారాయణ మాట్లాడుతూ… సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మండలంలోని పేదలందరికీ మూడు సెంట్ల ఇంటి స్థలం మూడు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని, మండలంలో భూమిలేని పేదలు చాలామంది ఉన్నారని అటువంటివారిని గుర్తించటంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారని, మండలంలో వందల ఎకరాలు భూ కబ్జాదారులు ఆక్రమించి చేసుకుంటున్నప్పటికీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా గాలికివదిలారని ఏళ్ల తరబడి భూములు ఆక్రమణకు గురవుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటో తెలియదని వారు పేర్కొన్నారు. పంచాయతీల వారీగా సచివాలయం సిబ్బందితో కమిటీ వేసి భూమిలేని పేదలను గుర్తించి భూములు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు రాజు,సుజన్ కుమార్,ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.