ఓఆర్ఆర్ వరకు హైడ్రా పరిధి సీఎస్ శాంతికుమారి

ఓఆర్ఆర్ వరకు హైడ్రా పరిధి సీఎస్ శాంతికుమారి

హైదరాబాద్: హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని చెరువులు, పార్కులు,

నాలాలతో పాటు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతను పూర్తిస్థాయిలో హైడ్రాకు అప్పగించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. హైడ్రాకు మరిన్ని అధికారాలతో పాటు సిబ్బందిని కేటాయిస్తూ విధివిధానాలు రూపొందిస్తామని పేర్కొన్నారు. చెరువుల్లో ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై ఇటీవల హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు సీఎస్ గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను తొలగించేందుకు నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ, పురపాలక, పంచాయతీరాజ్, వాల్టా, భూఆక్రమణల చట్టం కింద విభాగాలు వేర్వేరుగా నోటీసులు జారీ చేయడంతో ఇబ్బందులు వస్తున్నాయని.. ఇకనుంచి నోటీసులన్నీ హైడ్రా ద్వారా ఇచ్చేందుకు విధివిధానాలు సిద్ధం చేయాలని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ఇకనుంచి నోటీసుల జారీ, తొలగింపు చర్యలన్నీ ఒకే విభాగంగా హైడ్రా పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. “హైడ్రా పరిధిలో 72 బృందాలు ఏర్పాటయ్యాయి. వీటిని మరింత బలోపేతం చేసేందుకు పోలీసు, సర్వే, నీటిపారుదల శాఖల నుంచి అధికారులు, సిబ్బందిని త్వరలో కేటాయిస్తాం. గండిపేట, హిమాయత్సాగర్ చెరువుల పరిరక్షణ జలమండలి నుంచి హైడ్రా పరిధిలోకి తీసుకువస్తాం” అని సీఎస్ పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment