తూప్రాన్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
నిరుపేద మహిళలకు చీరలు,బట్టలు పంపిణీ
శఫర్డ్ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో క్యాడ్బరీస్ చాకోకుకీస్ బిస్కెట్లు పంపిణీ
చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో డిసెంబర్ 25 ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని చర్చలలో ఘనంగా క్రిస్మస్ పండుగలు జరుపుకున్నారు ప్రేమ,కరుణ,దయ,జాలి, శాంతి, సౌభాగ్యాలను అందించి సమస్త మానవాళిలో ఆనందం నింపిన క్రిస్తు అందరికీ ఆదర్శప్రాయం అని అందుకే ఏసు ప్రభువు మీ కొరకు పుట్టియున్నాడని తూప్రాన్ మున్సిపల్ కౌన్సిలర్ దుర్గారెడ్డి అన్నారు. బుధవారం పోతరాజుపల్లి పిలదేల్పీయా చర్చి లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ జానకిరామ్ మాట్లాడుతూ యెహోవా నీతి మంతులను, నిజాయితీ పరులను ఎల్లవేళలా కాపాడుతూ ఆశీర్వదించి వెన్నంటి ఉండి కాపాడుతాడని తెలిపారు. ఏసు పుట్టింది నీ కోసమే… ఏసు చనిపోయింది కూడా నీ కోసమే.. తిరిగి లేచింది నీ కోసమే.. త్వరలో రాబోతుంది కూడా నీ కోసమే… అని ఉద్ఘాటించారు. సాటి మానవుల పట్ల ప్రేమ కరుణ, దయ చూపాలని ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన ఏసు క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం చాలా అదృష్టం అన్నారు. ఈ లోకం ప్రేమ హృదయాన్ని గాయ పరుస్తుంది, కానీ ఏసాయ్య మాత్రం ప్రేమతో గాయపడిన హృదయాన్ని బాగుచేస్తాడని, దేవుని ఆదరణ ఎంత గొప్పదో అర్ధం అవుతుందన్నారు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన నీలో.. నాలో.. అందరిలోనా వ్యాపించి ఉన్నాడని అన్నారు. విశ్వమానవాలికి ప్రేమ తత్వంతో వెలుగు పంచిన కరుణామయుడు ఏసు క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షఫర్డ్ స్వచ్ఛంధ సంస్థ అధినేత రొయ్యూరు సురేష్ అందజేసిన క్యాడ్బరీస్ చాకో కుకీస్ బిస్కెట్లు పంపిణీ చేశారు. అలాగే మహిళలకు చీరలు, బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కౌన్సిలర్ దుర్గారెడ్డి, భావనీ అంజయ్య యాదవ్ పంతులు, మాజీ వార్డ్ సభ్యులు పరశురామ్, మరియు పెద్దలు గౌరవనీయులు సీనియర్ జర్నలిస్ట్. డాక్టరేట్ జానకి రామ్ గారు, గైని బైటి భాస్కర్ గౌడ్, చర్చి పాస్టర్ ఎస్ఎన్ బెన్నీ, శ్రీలత, చర్చ్ సభ్యులు. శంకర్, శ్రీను, నర్సింలు, ప్రభాకర్, ప్రవీణ్, డేవిడ్, కుమార్, భూపాల్, సాయి, రమేష్, సుబ్బారావు, శేఖర్, ఏసుదాస్, హోసన్న, యాదగిరి, లక్ష్మణ్, రాజు, నర్సింగ్, ప్రదీప్, అనంతరావు, సాయి, నర్సింలు, మహేష్, నాగేష్, రవి, అనంతరాం, హోసన్నా, పరమేశ్, ప్రవీణ్, నాగేష్, సత్తన్న, జాషువా సునీల్, భూపాల్, వినయ్, సుబ్బారావు, విజయ్ కుమార్, సామ్యూల్, డబ్బ నాగరాజు యాదవ్, మల్లిఖార్జున్ గౌడ్, బాలయ్య, గడ్డం ప్రశాంత్ కుమార్, తోపాటు క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు.