కలెక్టర్‌పై దాడి కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

కలెక్టర్‌పై దాడి కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

కలెక్టర్‌పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ఓవైపు బీఆర్‌ఎస్ పార్టీ నేతల హస్తం ఈ దాడి వెనుక ఉందనే ఆరోపణలు ..

చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో నవంబర్ 13 ప్రతినిధి

వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్‌పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓవైపు బీఆర్‌ఎస్ పార్టీ నేతల హస్తం ఈ దాడి వెనుక ఉందనే ఆరోపణలు వినిపిస్తుండగా.. తమపై కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడిలో పాల్గొన్న నిందితుల్లో ఒకరు పట్నం నరేందర్‌ రెడ్డితో ఎక్కువసార్లు ఫోన్లు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో పట్నం నరేందర్ రెడ్డిని విచారించేందుకు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment