28న ఓటర్ల తుది జాబితా..!!

28న ఓటర్ల తుది జాబితా..!!

3న ముసాయిదా వర్షాలు, వరదలతో రీషెడ్యూల్
స్థానిక సంస్థల ఎన్నికలకు ఎస్ఈసీ కసరత్తు

చార్మినార్ ఎక్స్ ప్రెస్ న్యూస్ హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది.

ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా తయారీకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ (ఎస్ఈసీ) రీషెడ్యూల్ రిలీజ్ చేసింది. భారీ వర్షాలు, వరదల దృష్ట్యా గతంలో ఇచ్చిన షెడ్యూల్ ను సవరించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి గురువారం కొత్త షెడ్యూల్ ప్రకటించారు.

వాస్తవానికి గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారు చేసేందుకు గత నెల 21న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. దాని ప్రకారం ఈ నెల 6న ముసాయిదా, 21న తుది ఓటర్ల జాబితా ప్రచురించాలి. కానీ రాష్ట్రంలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాల్లోని అధికార యంత్రాంగం, క్షేత్రస్థాయి సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు.

ఇదీ సవరించిన షెడ్యూల్..

సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. దాన్ని గ్రామ పంచాయతీ, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ నెల 18న జిల్లా ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. 19న మండల స్థాయిలో ఎంపీడీవోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు.

ఈ నెల 14 నుంచి 21 వరకు ఓటర్ల జాబితా ముసాయిదాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 26న జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో అభ్యంతరాలను పరిష్కరిస్తారు. 28న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version