మసీదు వేడుకలో ఏనుగు బీభత్సం.. తొక్కిసలాట

మసీదు వేడుకలో ఏనుగు బీభత్సం.. తొక్కిసలాట

 

మలప్పురం: కేరళలోని మలప్పురం జిల్లా తిరూర్‌ సమీప మసీదులో నిర్వహిస్తున్న ఓ ఆధ్యాత్మిక వేడుకలో ఏనుగు ఉన్మాదంగా దాడికి పాల్పడటంతో జరిగిన తొక్కిసలాటలో 23 మంది గాయపడ్డారు..

 

వీరిలో ఏనుగు తొండంతో ఎత్తి గిరాటు వేసిన ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. వేడుక కోసం ప్రత్యేకంగా అలంకరించిన అయిదు ఏనుగులను తెచ్చి వరుసగా నిలబెట్టారు. ఇందులో ఓ ఏనుగు జనసమూహాన్ని చూసి రెచ్చిపోయి గుంపు మీదకు దూసుకుపోయింది. మావటీల ప్రయత్నంతో కాసేపటికి అది శాంతించింది..

Join WhatsApp

Join Now

Leave a Comment