పల్లెల్లో మొదలైన ఎన్నికల సందడి

పల్లెల్లో మొదలైన ఎన్నికల సందడి

మూడు దశల్లో నిర్వహణకు సన్నాహాలు

మున్సిపాలిటీ విలీన గ్రామాల పరిస్థితిపై చర్చ

మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.వాస్తవానికి లోక్‌సభ ఎలక్షన్లు ముగియగానే, స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం అయింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం, పాలనపై పట్టు సాధించేందుకు కొంత సమ యం పట్టింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కొంత ఆలసమైనప్పటికీ ముఖ్యమంత్రి ప్రకటనతో ఆ ప్రక్రియ ఊపందుకుం ది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సన్నద్ధం కూడా అవుతున్నారు. గ్రామ పంచాయతీల పాలన ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ముగియగా, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ల పాలక వర్గాల పదవీకాలం జూలైతో ముగిసింది. సర్పంచ్‌లు పదవీచ్యుతులై సుమారు ఐదు నెలలు గడుస్తుండడం, పాలకవర్గాలు లేకపోవడంతో పల్లెల్లో అభివృద్ధి కొంతమేర కుంటుపడింది. మరోవైపు స్థానిక సంస్థల పాలన ప్రత్యేకాఽధికారుల చేతు ల్లోకి వెళ్లింది. గరిష్ఠంగా మూడు నెలలకు మించి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగరాదనే నిబం ధన ఉంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వానికి అనివార్యం అయింది. కాగా సెప్టెంబరులో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న ట్లు సమాచారం.రిజర్వేషన్లు యథాతథం..

స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పుడున్న రిజర్వేషన్లే అమలు చేయను న్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. పంచాయతీ వార్డులు మొదలుకొని జడ్పీ చైర్మన్‌ స్థానం వరకు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసిన విధంగానే రిజర్వేషన్‌ అమలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన అనంతరం సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్‌ ఎన్నికల కోసం సిద్దమవుతున్న ఆశావహులు ఈ సారి తమ అధృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్ట సవరణ చేయడం ద్వారా రిజర్వేషన్లు పదేళ్ల వరకు ఉండేలా మార్పులు చేసింది. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అదే చట్టాన్ని అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. పాత చట్టం ప్రకారం రిజర్వేషన్లు అమలుచేసే పక్షంలో ఇంతకు ముందు బరిలో నిలిచి విజయం సాధించిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మళ్లీ పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

జిల్లాలోని గ్రామపంచాయతీలు…..

గ్రామపంచాయతీలు 469
వార్డులు 4086
ఎంపీటీసీ స్థానాలు 189
మండల పరిషత్ స్థానాలు 21
జడ్పిటిసి స్థానాలు 21

Join WhatsApp

Join Now

Leave a Comment