ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కొనసాగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశం .
సిఎం తో పాటు సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు.
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలు.. లబ్దిదారుల జాబితా ల తయారీ పై కొనసాగుతున్న చర్చ.
జనవరి 26 న రిపబ్లిక్ డే నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని నిర్ణయం.
ఈ నాలుగు పథకాల అమలుపై రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభ ల నిర్వహణ, మున్సిపాలిటీ ల్లో వార్డు సభలు నిర్వహించేందుకు వెంటనే సన్నాహాలు చేసుకోవాలని కలెక్టర్ల కు ఆదేశాలు .