జిల్లా అదనపు కలెక్టర్
ఆకస్మికంగా తనిఖీ
మరిపెడ మండల ప్రతినిధి జనవరి 9 చార్మినార్ఎక్సప్రెస్
మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పోమరిపెడ మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, (బారులు) మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ స్కూల్ (బాలికలు) లను ఆకస్మికంగా తనిఖీ చేశారు,
ఈ సందర్భంగా ఆయన స్టోర్ రూమ్, కిచెన్ గది, టాయిలెట్స్, క్లాస్ రూమ్స్ స్టడీ రూమ్స్ పరిసరాలను పరిశీలించారు,
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి నడుస్తున్న కామన్ డైట్ మెనూ ప్రకారం భోజనం అందించాలని సంబంధిత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లను ఆదేశించారు,
పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య బోధనలు అందించాలని, రాత్రి సమయాలలో విద్యుత్ అంతరాయం రాకుండా చూడాలని, స్వచ్ఛమైన ఆర్వో ప్లాంట్ వాటర్ నీరు అందించాలని, షెడ్యూలు ప్రకారం విద్యార్థిని, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, విద్యతోపాటు మానసిక వికాస తరగతులు, క్రీడలు, సాంస్కృతిక, కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు.