- హైడ్రా నోటీసులు ఇవ్వదు – కూల్చడమే..కమిషనర్ రంగనాథ్.
హైదరాబాద్ (చార్మినార్ ఎక్స్ ప్రెస్)
హైడ్రా నోటీసులు ఇవ్వదని, కేవలం కూల్చడమే ప్రధానమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. చెరువు ఎఫ్టీఎల్ ఆక్రమించి కళాశాలలు నిర్మించే యాజమాన్యాలపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అయితే అందులో చదివే విద్యార్థుల భవిష్యత్‌ను రోడ్డున పడేయకుండా ఆయా కళాశాలల యాజమాన్యానికి కొంత సమయం ఇస్తామని రంగనాథ్ తెలిపారు. రాజకీయ చదరంగంలో హైడ్రా పావుగా మారదల్చుకోవడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. చెరువు ఎఫ్టీఎల్ ఆక్రమించి కళాశాలలు నిర్మించే యాజమాన్యాలపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అయితే అందులో చదివే విద్యార్థుల భవిష్యత్‌ను రోడ్డున పడేయకుండా ఆయా కళాశాలల యాజమాన్యానికి కొంత సమయం ఇస్తామని రంగనాథ్ తెలిపారు.
జీహెచ్ఎంసీలోని పలువురు బీజేపీ కార్పొరేటర్లు బుద్దభవన్లో ఉన్న హైడ్రా కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్‌ను కలిసి చెరువులు, పార్కుల ఆక్రమణలపై ఫిర్యాదు చేశారు. ఓవైసీ, మల్లారెడ్డి సహా పలు ఆక్రమణలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లతో మాట్లాడిన రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వదని, కూల్చడమే తెలుసునని అన్నారు.పార్టీలకు అతీతంగా హైడ్రా చర్యలుంటాయని కార్పొరేటర్లకు వివరించారు.