పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పూజించాలి
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చల్లా లక్ష్మికాంత్
చార్మినార్ ఎక్స్ ప్రెస్ సూర్యాపేట ప్రతినిధి సెప్టెంబర్: 07
పర్యావరణ పరిరక్షణ కోసం, ప్రకృతి సమతుల్యత కోసం, మంచినీటి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకునితో తొలి పండుగ వినాయక చవితి ని జరుపుకోవాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చల్లా లక్ష్మికాంత్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా శనివారం నాడు ఉదయం
చల్లా బ్రదర్స్ చల్లా లక్ష్మికాంత్ , చల్లా లక్ష్మిప్రసాద్ ల ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని విటి రోడ్ భూమిరెడ్డి హాస్పిటల్ సమీపంలో *500 మందికి అరటి ఆకులలో పెట్టి బంకమట్టి వినాయక విగ్రహాలు, జ్యూట్ బ్యాగ్ లు, చేతి సంచులు, గులాబీ మొక్కల పంపిణీ* అత్యంత కన్నులపండువగా నిర్వహించారు. భక్తుల ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో చక్లా లక్ష్మికాంత్ మాట్లాడుతూ కెమికల్స్ వున్న విగ్రహాలు చెరువులలో నిమజ్జనం చేయడం వలన చెరువులో నీరు కలుషితం అవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో చల్లా లక్ష్మికాంత్ దంపతులు, చల్లా లక్ష్మి ప్రసాద్ దంపతులు, పబ్లిక్ క్లబ్ ఇసి మెంబర్ రాచకొండ శ్రీనివాస్, వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాచర్ల కమలాకర్, క్యాబినెట్ ట్రెజరర్ కలకోట లక్ష్మయ్య, బెలిదె శ్రీనివాసులు, బిక్కుమళ్ల కృష్ణ, మంచాల శ్రీనివాస్ గుప్త, తల్లాడ సోమయ్య, కర్నాటి సురేందర్, మిట్టపల్లి రమేష్ శ్రీదేవి, వాస నర్సింహరావు, ఓరుగంటి రామ్మూర్తి, ముప్పారపు నాగేశ్వరరావు, తోట కిరణ్, ముప్పారపు నరేందర్, యాదా కిరణ్, వంగవీటి రనేష్, బైరబోయిన శ్రీనివాస్, విడకా వెంకటేశ్వర్లు పలువురు ఆర్యవైశ్య నాయకులు , పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.