కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశుభ్రత-హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు
కాలుష్య నివారణకు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ శ్రీ గణేష్ తెలిపారు సోమవారం బోండా డివిజన్లోని టీచర్స్ కాలనీ పార్కులో నిర్వహించిన స్వచ్ఛ ధనం పచ్చదనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధి హాజరై మొండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక, బేగంపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్యలతో కలిసి మొక్కలు నాటారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ మొక్కలు నాటడంతోపాటు అవి భారీ వృక్షాలుగా ఎదిగే వరకు వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.. దోమల నివారణకు,చెరువుల సంరక్షణకు,నాళాల క్లీనింగ్, వనమహోత్సవం వంటి కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు జిహెచ్ఎంసి తలపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సి సంతోష్ యాదవ్, ఆర్ డి నాగేష్ యాదవ్, సి బద్రీనాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు