గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అల్వాల్ పోలీసులు అరెస్టు చేశారు

మేడ్చల్ జిల్లా (అల్వాల్): గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ తరలించిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అల్వాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అల్వాల్ ప్రాంతానికి చెందిన అంజనీ , బీహార్ కు చెందిన ఉత్తంకుమార్ వృత్తిరీత్యా సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ జీవనం కొనసాగించేవారు. వీరిద్దరు గంజాయి అమ్ముతున్నారని పక్కా సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద నుంచి నాలుగు కేజీల గంజాయి రెండు సెల్ ఫోన్లు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు ఈ మేర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అల్వాల్ పోలీసులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment