10 కేజీల నిషేదిత గంజాయి స్వాధీనం. ఆరుగురు నిందితుల అరెస్ట్

10 కేజీల నిషేధిత గంజాయి స్వాధీనం చేసుకుని ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన అల్వాల్ పోలీసులు…..అల్వాల్ పీఎస్ పరిధిలో గల గ్రీన్ ఫీల్డ్ కాలనీలో గల నారాయణ స్కూల్ పక్కన కాళీ ప్రదేశంలో గంజాయి అమ్ముతున్నారన్న  నమ్మదగిన సమాచారంతో దాడి చేసిన అల్వాల్ పోలీసులు అక్కడ శేఖర్, రవి నాయక్, మధుసూదన్ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా  ఆంధ్రప్రదేశ్ లోని  అరకు నుండి గంజాయి  కొనుగోలు చేసుకుని ఇక్కడికి తెచ్చి అవసరం ఉన్న వాళ్లకి అమ్ముతున్నట్టు తెలిపారు . వారి వద్ద గల  బ్యాగులో  అమ్మడానికి ఉంచుకున్న సుమారు 10 కిలోల నిషేధిత గంజాయిని స్వాధీనంచేసుకున్న పోలీసులు,  అదే గంజాయిని  కొనడానికి వచ్చిన, కళ్యాణ్, రాజు, నరేష్,.. అనే నిందితులను అదుపులోకి తీసుకొని  కేసు నమోదు చేసుకున్న అనంతరం  మొత్తం ఆరుగురు నిందితులను  రిమాండ్ కు తరలించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment