తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి మొండి చేయి చూపిన కేంద్ర బడ్జెట్

తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి మొండి చేయి చూపిన కేంద్ర బడ్జెట్

 

 సిపియం జిల్లా కమిటీ సభ్యులు మద్దెపురం రాజు

 

 

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర సర్కారు బడ్జెటులో మొండి చేయి చూపిందని సిపియం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు మద్దెపురం రాజు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.ఆదివారం గుండాలలో సిపియం ఆధ్వర్యాన నిరసన తెలిపారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లడుతూ శనివారం పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-2026 వార్షిక బడ్జెటులో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా హైదరాబాదులో మెట్రో రైల్వే లైన్ల విస్తరణ కాజీపేట రైల్వే కోచ్ బయ్యారంలో ఇనుము ఉక్కు కార్మాగారం వరంగల్ టెక్స్ టైల్ పార్కు ఆదిలాబాదులో సిమెంటు ఫ్యాక్టరీ గిరిజన యూనివర్సటీ ఏర్పాటు బీబీనగర్ నిమ్స్ హాస్పిటల్ మొదలైన తెలుగు రాష్ట్రాల విభజన హామీల అమలుకు గత పది సంవత్సరాల నుండి ప్రత్యేక నిధులు విడుదల చేయడం లేదన్నారు.ఇటీవల తెలంగాణాలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిజేపికి 35% ఓట్లు 8మంది పార్లమెంటు సభ్యులు గెలిచారు.ఇద్దరు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. అయినప్పటికీ నిధులు రాబట్టలేకపోయారని విమర్శించారు.

బడ్జెట్ పూర్తిగా సంపన్న వర్గాలు 

కార్పొరేట్లకు రాయితీలు కల్పిస్తూ 

 పేదల సంక్షేమం రాష్ట్ర అభివృద్దిని విస్మరించింది.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 50 లక్షల కోట్లు బడ్జెట్లో గ్రామీణ పేదల రాయితీలను కట్ చేసి బడా కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చిందని పేద ప్రజలకు రైతాంగానికి ఇచ్చే సబ్సిడీలను తగ్గించడాన్ని వ్యతిరేకించారు.ప్రజల కొనుగోలు శక్తిని పెంచే గ్రామీణ ఉపాధి హామీ పనికి గత సంవత్సరం కేటాయించిన 86 వేల కోట్లను మాత్రమే బడ్జెట్లో చూపించిందని ఆహార భద్రతకు పెద్ద ఎత్తున కొత విధించిందని విమర్శించారు.ఈ సంవత్సరం బడ్జెట్లో 2.4 కోట్ల రూపాయలు మాత్రమే కేటయించిదని దేశంలో ఉన్న 24 కోట్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు కోలుకోలేని దెబ్బ అని ఆవేదన వ్యక్తం చేశారు.మరోపక్క ప్రభుత్వ భూములు అమ్మకం ద్వారా 10 లక్షల కోట్లను ఆదాయం సమకూర్చుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించడం ఆందోళన కలిగించే అంశమని తక్షణమే ఈ ప్రతిపాదనలను వెనక్కి తీసుకొని సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దపడిశాల గ్రామ మాజీ ఉప సర్పంచ్ పోతరబోయిన అంజయ్య పార్టీ మండల కమిటీ సభ్యులు యండి.ఖలీల్ మల్లెబోయిన బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment