తెలంగాణ బిసి బహుజన సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా సింగోజు మురళీకృష్ణ ఆచార్యులు

తెలంగాణ బిసి బహుజన సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా సింగోజు మురళీకృష్ణ ఆచార్యులు

 

తెలంగాణ బిసి బహుజన

సంక్షేమ సంఘం యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా సిద్దిపేట పట్టణానికి చెందిన సింగోజు మురళీకృష్ణ ఆచార్యులను నియమించారు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజయ్ కుమార్.ఈ సందర్భంగా శుక్రవారం నియామక పత్రం అందజేశారు ప్రతాపగిరి విజయ్ కుమార్.అనంతరం

విజయ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్ట్ గానే కాకుండా వివిధ రంగాల్లో తమ కుల సంఘంలో,బిసి కుల సంఘాల్లోని సభ్యులను కులాలకు అతీతంగా చైతన్య పరుస్తూ వారి హక్కుల సాధన కొరకు తన వంతు కృషి చేస్తున్న సింగోజు మురళీకృష్ణ ఆచార్యులని గుర్తిస్తూ ఈ పదవిలో అవకాశం కల్పించామని తెలియజేశారు.ప్రస్తుతం తెలంగాణ రాష్టంలో బీసీలు రాజ్యాధికారంలో వాటా కోరకు బలమైన ఉద్యమాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా బీసీల లెక్కలు తీసి కులాల వారీగా వారి జనాభా ను ప్రకటించాలని జనాభా దామాషా ప్రకారం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కులాల వారీగా రిజర్వేషన్స్ కల్పించాలని రాష్ట్ర ముఖ్య మంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి గారిని కోరారు.అనంతరం సింగోజు మురళీకృష్ణ ఆచార్యులు మాట్లాడుతూ తనపై నమ్మకంతో యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా నియమించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజయ్ కుమార్ కు వారి కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు.తను శాయశక్తుల కృషిచేసి తన బీసీ సామాజిక వర్గానికి ప్రభుత్వపరంగా సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో బిసి నాయకులు వాసురి ఎల్లయ్య పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment