ఫిబ్రవరి 27న ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలు

ఫిబ్రవరి 27న ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలు

— మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తక్షణమే అమలులోకి వస్తుంది

 

… జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

 

 

ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా

(ECI), న్యూఢిల్లీ,కరీంనగర్ ,మెదక్ – నిజామాబాద్- అదిలాబాద్ ఉపాధ్యాయనియోజకవర్గంఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమం

డలి ఎన్నికల తేదీలను 29-01-2025న ప్రకటించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు గురువారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు షెడ్యూల్ కుసంబంధించిసంబంధితఆర్డీవోలు,తాసిల్దార్లు,ఎంపీడీవోలు,మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటిఫికేషన్ 03ఫిబ్రవరి2025నజారీఅవుతుందని,నామినేషన్లు సమర్పించడానికి చివరి తేదీ 10 ఫిబ్రవరి, స్కృట్నీ 11ఫిబ్రవరి,నామినేషన్లుఉపసంహరించుకునేందుకు చివరి తేదీ 13 ఫిబ్రవరి, పోలింగ్ 27 ఫిబ్రవరి 2025నఉదయం 8:00 నుండి మధ్యాహ్నం4:00గంటలవరకుజరుగనుందన్నారు.ఓట్ల లెక్కింపు 03 మార్చి 2025నప్రారంభమవుతుంది అని, ఎన్నికల ప్రక్రియ ను 08 మార్చి 2025లోగా పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.ఎమెల్సి ఎన్నికల షెడ్యూల్ వచ్చినందున మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎం సి సి) తక్షణ

మేఅమలులోకివస్తుందని..మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ఎన్నికల నియమాల ప్రకారం చర్యలు తీసుకోవడంజరుగుతుందన్నారు .మెదక్ జిల్లాలోని పోలీస్, అన్ని శాఖలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు ఎన్నికల కమీషన్ యొక్క ఈ ఆదేశాలను గమనించాలని జిల్లా ఎన్నికల అధికారి & కలెక్టర్ మెదక్ రాహుల్ రాజ్ వెల్లడించా

రు.ఈ టెలికాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ నగేష్, డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, సంబంధిత ఆర్డీ

వోలు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version