సైబర్ మోసాల పై ప్రజలకు అప్రమత్తం చేసిన తానూర్ పోలీసులు
తానూర్ మండలంలోని జవుల (బి) గ్రామంలో, ఎస్సై డి. రమేష్ ఆధ్వర్యంలో తానూర్ పోలీసులు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా, ప్రజలకు సైబర్ క్రైమ్, ట్రాఫిక్ నిబంధనలు, మరియు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఫోన్ వాడే ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత వివరాలను, బ్యాంక్ వివరాలను అజ్ఞాత వ్యక్తులతో పంచుకోకూడదని సూచించారు. దుమ్ము పెడుతూ వచ్చిన సందేహాస్పద లింకులు, మెసేజ్‌లను తెరవడం కూడా ప్రమాదకరమని చెప్పారు.
రోడ్డు భద్రత కోసం, జేబ్రా క్రాసింగ్‌ను ఉపయోగించడం, వాహన నడిపేటప్పుడు ఫోన్ వినియోగం నివారించడం, బస్సుల్లో ఎక్కి దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ఎంతో ముఖ్యం అని చెప్పారు.
వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, హెల్మెట్ తీసుకుని వెళ్లాలని, త్రిబుల్ రైడింగ్ చేయవద్దని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, నిబంధనలు ఉల్లంగిస్తే శాఖా పరిధిలో చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, యువకులు,
గ్రామస్తులున్నారు.