నేడు బయ్యారంలో జరిగే గ్రామసభ సద్వినియోగం చేసుకోండి.
మండల కేంద్రంలోని బయ్యారం పంచాయతీ కార్యాలయంలో (నేడు) శుక్రవారం నిర్వహించే గ్రామ సభను ప్రజలందరూ వినియోగించుకోవాలని కాంగ్రెస్ నాయకులు 8 వ వార్డు మాజీ మెంబర్ పోతుగంటి సుమన్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే, గ్రామ సభలలో ఇందిరమ్మ ఇండ్లు,ఆత్మీయ భరోసా,రేషన్ కార్డులు, రైతుబంధు,పథకాలకు దరఖాస్తు చేసుకొని వారు చేసుకోగలరని,రేషన్ కార్డులో,ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేర్లు రాని వారు ఆందోళన చెందవద్దని అన్నారు. రేషన్ కార్డులో పేరు రానివాళ్లు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని గ్రామపంచాయతీకి రావాలని,ప్రతి ఒక్కరు కూడా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జరిగే ఈ గ్రామసభను ప్రజలందరూ వినియోగించుకోవాలని వారు కోరారు.