ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
రేగోడ్ గ్రామ సభలో ఎంపీఓ విట్టల్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభలో ఎలాంటి అపోహలకు తావులేకుండా లబ్దిదారులకు అర్థం అయ్యేలా నాలుగు పథకాలలో అర్హులైన వారి పేర్లు చదివి వినిపించారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సితరవమ్మ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టతున్నా గ్రామసభలలో అర్హులైన అందరికీ పథకాలు వర్తిస్తాయని, రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ భరోసా, ఆత్మీయ భరోసా పలు సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. లబ్ధిదారుల పేర్లు లిస్ట్‌లో రాకపోతే ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ప్రజా పరిషత్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ప్రత్యేక కౌంటర్ ఉంటుంది అని అక్కడ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ఫిరోజ్, పీసీసీ సభ్యుడు మున్నూరు కిషన్, మాజీ పిఏసిఎస్ ఛైర్మన్ శ్యామ్ రావు కులకర్ణి, మాజీ ఎంపీటీసీ మన్నే నరేందర్, మాజీ కో ఆప్షన్ సభ్యుడు చోటు మియా, పోలీస్ కృష్ణ, మాజీ ఎంపిటిసి గొల్ల నర్సింలు, ఏఎంసి డైరెక్టర్లు శ్రీధర్ గుప్తా, ఫాజిల్, నాయకులు మల్లికార్జున్, శివకుమార్, చిదిరే కృష్ణ, ఏఈఓ భూలక్ష్మి, పంచాయతి సెక్రటరీ అరుణ్ స్థానిక ప్రజాప్రతినిధులు, యువకులు ప్రజలు పాల్గొన్నారు.