నిరంతర విద్యుత్ కు సమ్మర్ యాక్షన్ ప్లాన్ 

నిరంతర విద్యుత్ కు సమ్మర్ యాక్షన్ ప్లాన్ 

-విద్యుత్ ఎస్ఈ నరేష్ 

-ట్రాన్సఫార్మర్ ను పరిశీలించిన ఎస్ ఈ 

 

 

 

 

రానున్న వేసవి లో మెరుగైన నాణ్యమైన విద్యుత్ అందించెందుకు నిరంతర విద్యుత్ సరఫరా కు సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసి నట్లు ఎన్పీడీసీఎల్ మహబూబాబాద్ ఎస్ ఈ నరేష్ అన్నారు. శుక్ర వారం మరిపెడ పట్టణ కేంద్రంలోని బోడా అమృతండా శివారులో సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఏర్పాటు చేసిన 100 కెవి ట్రాన్స్ఫార్మర్ ను ఎస్ ఈ నరేష్ పరిశీలించారు. అనంతరం తొర్రూర్ డివిజనల్ అధికారి మధుసూదన్ తో కలిసి సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సరఫరా లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా మందస్తు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిపారు. మరిపెడ లో విద్యుత్ లో వోల్టేజ్ సమస్య ఎక్కడెక్కడ ఉన్నదో గుర్తించామని సమ్మర్ యాక్షన్ లో భాగంగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.టౌన్ లో ఒకటి 160కెవిఏ, నాలుగు 100 కెవిఏ లు, మరిపెడ రూరల్ లో ఇరవై ఆరు 25కేవీఏ లైటింగ్ డి టి ఆర్ లను సమ్మర్ ప్లాన్ లో ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో విద్యుత్ లో వోల్టేజ్ సమస్య లేకుండా పరిష్కరించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశం లో మరిపెడ సబ్ డివిజన్ ఏడిఈ బి. అజయ్, ఏఈ లు పావని,నవ్య తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment