ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల బంద్ విజయవంతం
గుంతకల్లు పట్టణం పొట్టి శ్రీరాములు సర్కిల్ నందు వైయస్సార్సీపి, ఎఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఎ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నారాయణ విద్యాసంస్థలకు తొత్తుగా పనిచేస్తున్న జిల్లా ఆర్ఓ ను సస్పెండ్ చేయాలన్నారు. మంత్రి నారాయణను మంత్రివర్గం నుండి తొలగించాలని, ప్రైవేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడిని అరికట్టాలన్నారు. అనంతపురంలో జరిగిన సంఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి మరియు విద్య శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి వంశి యాదవ్, నియోజవర్గ అధ్యక్షులు నారప్ప, నాయకులు అంజి, అనిల్, రాజశేఖర్ యాదవ్, అశోక్, కేశవ, ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యవర్గ సభ్యుడు అఖిల్, టౌన్ సెక్రటరీ శివమణి, ఎస్ఎస్ఐ నియోజవర్గ కార్యదర్శి వెంకటేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.