శ్రీ సరస్వతి విద్యా నిలయంలో సామూహిక అక్షరాభ్యాసం ను విజయవంతం చేయండి
వసంత పంచమి, చదువుల తల్లి సరస్వతి దేవి పుట్టిన రోజు సందర్భంగా సోమవారం సూర్యాపేట పట్టణంలోని శ్రీ సరస్వతీ విద్యా నిలయంలో సామూహిక అక్షరాభ్యాసం మరియు సరస్వతి మాత పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీ సరస్వతీ విద్యా నిలయం కరస్పాండెంట్ యానాల వెంకట్ రెడ్డి అన్నారు. ఉదయం వేద బ్రాహ్మణోత్తములచే గణపతి పూజా, శ్రీసరస్వతీ మంత్ర ప్రయుక్త ఏకాదశీ,శ్రీగాయత్రి యజ్ఞం నిర్వహించమడును. ఇట్టి విశిష్ట పర్వదినోత్సవం నాడు నిర్వహించే పూజా కార్యక్రమం లో మీ చిన్నారులను భాగస్వాములను చేసి సరస్వతీమాత సంపూర్ణ అనుగ్రహంతో పాటు ఉత్తమ సంస్కారాలు అందించగలరని కోరుచున్నామని అన్నారు.అనంతరం సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అర్చన చేయించిన కుంకుమ మరియు అమ్మవారి ఫోటో చిన్నారులకు అందజేస్తామని,పిల్లలకు అక్షరాభ్యాసం చేయించే తల్లిదండ్రుల గోత్ర నామాలతో తమ యొక్క సమాచారం సెల్ 9848033287,9441252663
ఈ నెంబర్లు కు అందించగలరని కరస్పాండెంట్ యానాల వెంకట్ రెడ్డి తెలిపారు .